BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS
BSNL కార్పొరేట్ కార్యాలయం BSNL లో గుర్తింపు  పొందిన సంఘాలకు మంజూరు చేయబడిన అన్ని సౌకర్యాలను 24-04-2016 తో నిలిపివేసింది.  7వ గుర్తింపు యూనియన్ ఎన్నికల ఫలితాలు 12-05-2016 వరకు పరిమిత సౌకర్యాలు అన్ని సంఘాలకు సమకుర్చబడును,  అంటే 11-03-2016 నుండి 12-05-2016 వరకు మాత్రమే. 

ఈ విషయం లో రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రేమ్నాథ్ గారు , రాష్ట్ర  CGM గారికి ఒక పత్రం సమర్పించారు, 
7వ గుర్తింపు యూనియన్ ఎన్నికల సమయంలో పరిమిత సౌకర్యాల లో గుర్తింపు పొందిన సంఘాలకు ఆవాసము సంకుర్చినట్టుగా BTEU కూడా జిల్లా స్థాయి లో కాని రాష్ట్ర ముఖ్య కార్యాలయం లో కాని సమకూర్చాలని అభ్యర్దించారు. లేని పక్షంలో మిగితా యునియన్లకు కూడా 7వ గుర్తింపు యూనియన్ ఎన్నికల ఫలితాలు 12-05-2016 వెలువడే వరకు ఆ సౌకర్యమును నిలిపివేయాలి విన్నవించారు . 

ఇది జాతీయ స్థాయి ఎన్నికల విషయం కాబట్టి BSNL ముఖ్యకార్యాలయం యొక్క ఆదేశాలు  అందరికి ఒకే విధంగా వర్తిస్తాయి కాబట్టి వెంటనే ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు. 
భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top