BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

ఇటీవల బి ఎస్ ఎన్ ఎల్ మేనేజ్మెంట్ మూడు రకాల ఉత్తర్వులు జారీచేసింది. వీటి పై కొంతమంది మిత్రులు కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి ని విశ్లేషణ చేద్దాం. 
      
1 జూలై 2018 నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో ఫ్యామిలీ ప్లానింగ్  ఇంక్రిమెంట్ రద్దు అవుతుంది. కేంద్రం ఏడవ వేతన సంఘం అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 70 రకాల ఆలవెన్స్ లు అడ్వాన్స్ లు రద్దు చేసింది. బి ఎస్ ఎన్ ఎల్ కూడా ఇదే బాటలో మొదటిగా కుటుంబ నియంత్రణ ఇంక్రిమెంట్ రద్దు చేసింది. మనకు వేతన సవరణ ఇంకా అమలు కాలేదు కదా? అప్పుడే ఈ రద్దు అమలు చేయడం అన్యాయం కదా? అని కొంతమంది అంటున్నారు. కానీ ఏడవ వేతన సంఘం సిఫార్సు లు డి సి ఆర్ జి 20 లక్షలు,లాంటి కొన్ని బి ఎస్ ఎన్ ఎల్ అమలు చేసింది. ఇది గుర్తించాలి.                                  2. గ్రూప్ బి/ గ్రూప్ సి/గ్రూపు డి ఉద్యోగుల వేతనాలు ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీ, ఆరోజు ఒక వేళ సెలవు అయితే ఆమరుసటి రోజు చెల్లిస్తారు. గ్రూప్ ఏ అధికారులకు ప్రతి నెల 5 వ తేదీ చెల్లిస్తారు. ఇది ఎందుకు జరిగింది? గత ఆర్థిక సంవత్సరం లో బి ఎస్ ఎన్ ఎల్ ఆదాయం దాదాపు 32000 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం లో బి ఎస్ ఎన్ ఎల్ ఆదాయం 23000 కోట్లు గా ఉంది. అంటే ఆదాయం దాదాపు 10000 కోట్లు తగ్గింది. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం కంపెనీల ఆదాయాలు పడిపోయి కొన్ని మూటపడి పోగా బి ఎస్ ఎన్ ఎల్ పై కూడా ఈ ప్రభావం వుంది. ఎం టి ఎన్ ఎల్ ప్రభుత్వం నుండి లెటర్ ఆఫ్ ఆథారైజే షన్ తీసుకొని బ్యాంకు లనుండి ఎప్పటికప్పుడు రుణం తీసుకుని జీతాలు ఇస్తోంది. బి ఎస్ ఎన్ ఎల్ బ్యాంకు రుణాలకు బదులుగా తనకు రోజువారీ వచ్చే ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుని జీతాలు చెల్లిస్తోంది.  అప్పు చేయడం కంటే ఇది ఒక రకంగా మేలే. మనం గతంలో జి పి ఎఫ్ ల చెల్లింపు బి ఎస్ ఎన్ ఎల్ మాత్రమే చేయాలని కోరాం. జి పి ఎఫ్ ల చెల్లింపు బాధ్యత నుండి బి ఎస్ ఎన్ ఎల్  తప్పు కొని డి ఓ టి కి బదిలీ చేస్తే ఇదీ మేలే అని ,దానికి బి ఎస్ ఎన్ ఎల్ ఆర్ధిక పరిస్థితి కారణం అని ఊరుకున్నాం. రాబోయే రోజుల్లో మన జీతాలు కూడా ఒకటవ తేదీ కాకుండా ఏ ఐదవ తేదీ కి,10 వ తేదీ కి మారుతుందా? అంటే ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు! బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి మారావచ్చు!     3. ఇంకొక ఉత్తర్వు ఎంత మంది ఉద్యోగులు బి ఎస్ ఎన్ ఎల్ లో వుంటారు!ఎంత మంది రిటైర్ అవుతారు!అన్న ఉత్తర్వు. 59-60 ఏళ్లు ఉన్నవారు 17105,అంటే రాబోయే ఒక సంవత్సరం లో వీరు రిటైర్మెంట్ అవుతారు.55-58 ఏళ్లు వచ్చిన వారు 66013 మంది ఉన్నారు. అంటే రాబోయే నాలుగు ఏళ్ల లో వీరు రిటైర్మెంట్ అవుతారు. అంటే రాబోయే 4/5 ఏళ్లలో మొత్తం 83118 మంది ఉద్యోగులు పదవి విరమణ చేస్తారు. మొత్తం 182390 మంది బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల లో 2022 నాటికి బి ఎస్ ఎన్ ఎల్ లో కేవలం 95000 మంది ఉంటారు. వచ్చే వేతన సవరణ జరిగే 2027 నాటికి కేవలం 53227 మంది ఉద్యోగులే వుంటారు. 2022 నాటికి ఉండే 95000 మంది ఉద్యోగుల లో50000 మంది అధికారులు ఉంటే, నాన్ ఎగ్జిక్యూటివ్ లు 45000 మంది ఉంటారు.ఈ 45000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ లలో 30000 మంది టి టి ఏ (జె యి) లు కాగా మిగతా వారు కారుణ్య నియామకాల వారు. 2027 నాటికి ఉండే 53227 మందిలో 30000 మంది అధికారులు కాగా 23000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ లు. గమనించాల్సిన అంశం ఏమిటంటే రాబోయే 4 ఏళ్లలో 50% ఉద్యోగులు రిటైర్ అవుతారు. అంటే జీత భత్యాల కోసం బి ఎస్ ఎన్ ఎల్ ప్రస్తుతం ఖర్చు చేసే 15000 కోట్లు రాబోయే 4 ఏళ్ల లో ఈ ఖర్చు 8000 కోట్లకు తగ్గుతుంది. కనుక ఇప్పుడు జరగ బోయే వేతన సవరణ చర్చలలో ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని వాదించాలి. మరోవైపు పదవి విరమణ చేసే ఈ 50 % మంది ఉద్యోగుల కు ఉన్న స్టాగ్నేషన్, అనామాలీలు, ప్రమోషన్ విధానాలు లాంటివి వీరిని దృష్టి లో ఉంచుకుని వేతన సవరణ చర్చ లు జరిగితే వీరికి న్యాయం జరుగుతుంది.

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top