BlogTariff

Bharatiya Telecom Employees Union
NEWS

భారతీయ టెలికాం ఉద్యోగుల సంఘం ఆలిండియా జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్ సీ పాండే గా రు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆందోళన కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

29.06.2018 న అన్ని జిల్లాల కేంద్రాలలో ధర్నా /డెమాన్స్ట్రేషన్స్ నిర్వహించాలి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని తిరిగి హైదరాబాద్ పంపాలని, లోకల్ గా ఆప్షన్ లు పిలిచి ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ లో నియమించుకోవాలన్న డిమాండ్ మీద మన యూనియన్ ఇచ్చిన నోటీసులో అన్ని వివరాలు మరియు డిమాండ్ లు ఉన్నాయి.

విషయం సభ్యులందరికి తెలియజేసి అందరినీ కార్యక్రమంలో పాల్గొనునట్లు చేసి ఈ ఆందోళన కార్యక్రమాన్ని తప్పక విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు, సర్కిల్ బ్రాంచి కార్యదర్శి, సర్కిల్ కార్యవర్గ సభ్యులు మరియు ఆలిండియా కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ధన్యవాదములు.

ఇట్లు

కుమ్మితి ధర్మాంగదుడు ( సర్కిల్ కార్యదర్శి )
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్, విజయవాడ.

భారతీయ టెలికాం ఎంప్లాయిస్ యూనియన్ (బిఎస్ఎన్ఎల్)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి Gmail ID

 
Top